నేరేడుగొమ్ము, అక్టోబర్ 16 : గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కోరారు. అనంతరం ఎమ్మెల్యేను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గోవిందు యాదవ్, భిక్క నాయక్, వెంకటయ్య గౌడ్, బాలు నాయక్, పాపా నాయక్, హరికృష్ణ, బాబురామ్, వెంకటయ్య, ప్రిన్సిపాల్ కొర్ర శిరీష, లాలు నాయక్, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.