నార్నూర్ : వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ ( Congress Utter Flop ) అయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ( Rathod Janardhan ) అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ఏ ఒక్క హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలు లేవు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజా పక్షాన బీఆర్ఎస్ పార్టీ సమస్యలపై ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ , మండల అధ్యక్షుడు మేస్రం హన్మంత్ రావు, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు ఉర్వేత రూప్ దేవ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాథోడ్ సుభాష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ ఖాన్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, మాజీ సర్పంచ్ మడావి సాగర్ తదితరులున్నారు.