Rathod Janardhan | వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ : రాథోడ్ జనార్దన్
Rathod Janardhan | వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు.
నార్నూర్ : వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ ( Congress Utter Flop ) అయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ( Rathod Janardhan ) అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ఏ ఒక్క హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలు లేవు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజా పక్షాన బీఆర్ఎస్ పార్టీ సమస్యలపై ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ , మండల అధ్యక్షుడు మేస్రం హన్మంత్ రావు, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకులు ఉర్వేత రూప్ దేవ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాథోడ్ సుభాష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ ఖాన్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, మాజీ సర్పంచ్ మడావి సాగర్ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

