న్యూఢిల్లీ : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను (Delhi Ordinance) వ్యతిరేకించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. బెంగళూర్‌లో జులై 17, 18న జరగనున్న విపక్షాల భేటీ నేపధ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ ఆర్డినెన్స్‌పై తన వైఖరి స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆప్ సర్కార్‌కు బాసటగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
జులై 15న జరిగిన పార్టీ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్ధకు, పాలనా వ్యవస్ధకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ సమాఖ్య వ్యవస్ధకు తూట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఇలా కాషాయ పాలకులు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్ధను బలహీనపరిచే ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని పవన్ ఖేరా పేర్కొన్నారు. పార్టీ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై చర్చించారు.
Read More :
Allu Arjun | అల్లు అర్జున్ ఇండియాలోనే నంబర్ 1 స్టార్.. ట్రెండింగ్‌లో ఆదిత్య ఓం కామెంట్స్