ఎల్లారెడ్డి, జూలై 12: లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జాజాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రెండేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో విజయ్, లక్ష్మీనారాయణ, నవీన్, సాయికుమార్, సదానంద్, భూపతి. అనిల్, శ్రీకాంత్ ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేశ్. నర్సింహులు, కిష్టయ్య, సందాప్, యూసుఫ్, గన్నూ నాయక్, సర్వన్, రూప్ సింగ్, విఠల్ పాల్గొన్నారు.