పాలకుర్తి ఆగస్టు 24 : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగపురం ప్రభాకర్, ఈర్ల రవి, గాదరి వేణు, గొల్ల పరుశరాములు, మట్ట రవి, బక్క నరసయ్య, బక్క మహేందర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎంకేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై అభివృద్ధిలో భాగస్వాములము కావడానికి బీఆర్ఎస్లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావును అధిక మెజారిటీతో గెలిపించేందుకు కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.