– బీఆర్ఎస్ సారపాక పట్టణాధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు
బూర్గంపహాడ్, సెప్టెంబరు 08 : ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ గూండాగిరితో బరితెగింపు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ సారపాక పట్టణాధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్పై దాడి చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. దమ్ము, ధైర్యం లేక సీఎం రేవంత్రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు దుయ్యబట్టారు. మరోపక్క మహిళా లోకం సిగ్గుపడేలా అసెంబ్లీ వద్ద పోలీసులు మహిళా ప్రజాప్రతినిధుల చీరలాగడం, జుట్టు పీకడం వంటి ఘటనలు కాంగ్రెస్ నీచ పాలనకు అద్దం పడుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రతిపక్షంలో ఉన్న నేతల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ఇలాంటి దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉందన్నారు.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావాలి, ఆయన చావు కోరుకుంటున్నామని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ గూండాగురిని రుజువు చేస్తుంది. ప్రజా నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ చేస్తున్న నీచ రాజకీయం ప్రజాస్వామ్యాన్ని గొంతునొక్కేలా ఉంది. మరోపక్క సోమవారం అసెంబ్లీ వద్ద మహిళ ప్రజా ప్రతినిధులను పోలీసులు కించపరిచిన తీరు యావత్ మహిళా లోకానికే జరిగిన అవమానంగా కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తుంది.

‘కాంగ్రెస్వీ బరితెగింపు రాజకీయాలు’