BRS | బోయిన్పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల వద్ద హైటెన్షన్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ నేప థ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడు దల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అరెస్ట్ చేశారు.
వారిని బోయిన్పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు అహం కారపూరితంగా ప్రవర్తించారు. ఎవడ్రా నువ్వు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం ప్రదర్శిం చారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బోయిన్పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల వద్ద హైటెన్షన్
కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ నేపథ్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు
రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలపై భగ్గుమంటున్న కార్యకర్తలు… https://t.co/b3YDLq3VGR pic.twitter.com/5aOiUOilyw
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026