– మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి
– ప్రజావాణిలో వినతిపత్రం అందజేత
వైరా టౌన్, సెప్టెంబర్ 07 : ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై వినతి పత్రాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు, షేక్ లాల్, మొహమ్మద్, కామినేని శ్రీనివాసరావు, కౌన్సిలర్ చిలక చిన్న కోటయ్య, తిరుపతి, శ్రీను, బానోత్ సక్కుబాయి, అప్పం సురేష్, గుజ్జర్లపూడి దేవరాజ్, వేముల శివకృష్ణ, అయినాల కనకరత్నం, షేక్ సైదా, ఏదులూరి శ్రీను, బట్ట భద్రయ్య, మన్యం సత్యానందం పాల్గొన్నారు.