Nagender Reddy Kasarla | బీఆర్ఎస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం : నాగేందర్ రెడ్డి కాసర్ల
Nagender Reddy Kasarla | గతంలో రాహుల్ గాంధీ నల్ల దుస్తులతో పార్లమెంట్లో నిరసన తెలిపినప్పుడు అభ్యంతరం చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అదే విధంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
Nagender Reddy Kasarla | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తీవ్రంగా ఖండించారు.
ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను సభలోకి వెళ్లకముందే అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పోలీసు బలంతో ప్రతిపక్ష గొంతును అణచివేయడం సరికాదని మండిపడ్డారు. గతంలో రాహుల్ గాంధీ నల్ల దుస్తులతో పార్లమెంట్లో నిరసన తెలిపినప్పుడు అభ్యంతరం చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అదే విధంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారశైలి తీవ్రంగా ఖండించదగినదని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయకుండా, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో స్వేచ్ఛగా చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని నాగేందర్ రెడ్డి కాసర్ల డిమాండ్ చేశారు.
Read Also :
Vijay Sethupathi | విజయ్ సేతుపతి, సాయిపల్లవి లుక్ అదిరింది.. టైటిల్ ఏంటో తెలుసా..?
Bipasha Basu | బిపాసా బసు రీ ఎంట్రీకి రెడీ.. 8 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

