Delhi University : ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని సత్య నికేతన్(Satya Niketan)లో ఐదంతస్తుల పీజీ భవనం కూలిన ఘటన ఏడుగురు విద్యార్థులను బలిగొన్నది. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లిన తమ బిడ్డల జీవితం విషాదంగా ముగియడం పట్ల వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాగా చదివి పెద్ద ఉద్యోగంలో చేరి తమ కలల్ని సాకారం చేస్తారనుకుంటే.. విగతజీవులైన తమ పిల్లల చూసి గుండెలు బాదుకుంటున్నారు కన్నవాళ్లు. సత్యనికేతన్ ప్రాంతంలో ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో భవనాలు చాలానే ఉన్నాయి. మరి.. ప్రమాదమని తెలిసినా సరే ఏళ్లకు పైబడిన ‘హాస్టల్ డేజ్’ లాంటి భవంతుల్లోనే విద్యార్థులు బస చేయడానికి కారణాలున్నాయి.
ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని సత్యనికేతన్‌లో 50 ఏళ్ల భవంతి ఏడుగురు విద్యార్థుల ఆశల్ని చిదిమేసింది. యూనివర్సిటీలో చదివి.. మంచి ఉద్యోగంతో కుటుంబానికి అండగా నిలవాలనుకున్న వారిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోర ప్రమాదానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ కారణమైతే.. యూనివర్సిటీలో సరిపోను గదులు లేకపోవడం మరో కారణం.ఎన్డీటీవీ ప్రత్యేక కథనం ప్రకారం.. విశ్వవిద్యాలయం పరిధిలో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. హాస్టళ్లలో 8 వేల గదులు మాత్రమే ఉన్నాయి. దాంతో.. గత్యంతరం లేక సమీపంలోని సత్య నికేతన్‌లోని పీజీ హాస్టళ్లలో ఉంటున్నారు విద్యార్థులు. ఇరుకుగా ఉండే ఆ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు.
VIDEO | Delhi: Satya Niketan building collapse claims the lives of students who had come to Delhi in pursuit of better education.
Arpit Jaj, a second-year https://t.co/G4HTRzkoy2 student at Atma Ram Sanatan Dharam College, had come to Delhi from Dewas and was staying in a rented… pic.twitter.com/kYuRPJ2hNp
— Press Trust of India (@PTI_News) September 7, 2026
యూనివర్సిటీ రికార్డుల ప్రకారం.. 2024-25 విద్యాసంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది కోర్సుల్లో చేరారు. అయితే.. వీరందరికీ హాస్టల్ రూమ్ దొరకదు. 31 మందిలో ఒక్కరికే యూనివర్సిటీ హాస్టల్ గది కేటాయిస్తున్నారు. అంటే.. సీటు సాధించిన వారిలో కనీసం 10 శాతం మందికి కూడా హాస్టల్ వసతి దూరమవుతోంది. ఈ పరిస్థితుల్లో.. క్యాంపస్ సమీపంలోని పీజీ హాస్టళ్లలో బస చేస్తున్నారు విద్యార్థులు. దాంతో.. అద్దెకు ఆశపడి పురాతన భవంతులనే యజమానులు కొనసాగిస్తున్నారు.
‘హాస్టల్ డేజ్’ భవనం బేస్మెంట్ నిర్మాణ పనులతో ఒక్కసారిగా కుప్పకూలడం, ఏడుగురి మృతితో అధికారులు మేల్కొన్నారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సత్య నికేతన్ ప్రాంతలోని పీజీ హాస్టళ్లపై ఆడిట్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కూడా డీయూ పరిధిలోని క్యాంపస్‌లోని హాస్టళ్లలో వసతులు, విద్యార్థులకు గదుల కేటాయింపుపై దృష్టి సారించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.
STORY | Booked rooms, packed bags, then came collapse: Students rethink move to Delhi’s Satya Niketan
They had chosen their rooms, settled on the rent and were preparing to move to Satya Niketan. For some, the move was only days away. For others, Sunday was meant to be the final… pic.twitter.com/tWJhjkcyvm
— Press Trust of India (@PTI_News) September 7, 2026