AK-203 Rifles: AK-203 రైఫిళ్లకు అదానీ అమ్యునిషన్.. కుదిరిన అయిదేళ్ల డీల్
AK-203 Rifles: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన రక్షణ సంస్థ.. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో అయిదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నది. ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లకు ఆ కంపెనీ అమ్యునిషన్ సరఫరా చేయనున్నది. ఆ ఒప్పందం ప్రకారం.. ఐఆర్ఆర్పీఎల్కు అదానీ డిఫెన్స్ కంపెనీ 7.62 ఎంఎం అమ్యునిషన్ సరఫరా చేస్తున్నది.
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన రక్షణ సంస్థ.. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లకు ఆ కంపెనీ అమ్యునిషన్ సరఫరా చేయనున్నది. ఆ ఒప్పందం ప్రకారం.. ఐఆర్ఆర్పీఎల్కు అదానీ డిఫెన్స్ కంపెనీ 7.62 ఎంఎం అమ్యునిషన్ సరఫరా చేస్తున్నది. యూపీలోని కోర్వాలో ఉన్న అదానీ డిఫెన్స్ కంపెనీ రష్యా డిజైన్ చేసిన రైఫిళ్లను భారత సైనిక దళాల కోసం తయారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయిదేళ్ల పాటు అదానీ కంపెనీ స్మాల్ క్యాలిబర్ అమ్యునిషన్ సరఫరా చేయనున్నది. కాన్పూర్‌లో ఉన్న అదానీ డిఫెన్స్ ఫెసిలిటీలో ఆ మందుగుండు సామాగ్రి తయారు కానున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
అయితే ఎన్ని రౌండ్లకు చెందిన మందుగుండును సరఫరా చేస్తారన్నది ఇంకా డీల్‌లో స్పష్టం కాలేదు. ఐఆర్‌ఆర్‌పీఎల్‌ను 2019లో స్థాపించారు. భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య ఒప్పందం ద్వారా అది ప్రారంభమైంది. అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అండ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు ఇండియా తరపున ఆ డీల్‌లో షేర్‌హోల్డర్లుగా ఉన్ఆనయి. ఇక రష్యా తరపున కష్నికోవ్ , రోసోబోరన్ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి.
601,427 AK-203 రైఫిళ్ల తయారీ కోసం డిసెంబర్ 2021లో భారత రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ డీల్ విలువ సుమారు 5వేల కోట్లు. భారతీయ భద్రతా దళాలకు కోర్వా ప్లాంట్ నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల ఏకే-203 రైఫిళ్లను డెలివరీ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

