తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ( BRS ) రాష్ట్ర నాయకుడు, ఉల్లెంగుల సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉల్లంగుల ఏకనందం శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ ( KTR ) ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలో పార్టీ అభివృద్ధి గురించి చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఒక్కతాటిపై ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.