కనగల్, మార్చి 21 : ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి కృష్ణా పుష్కర ఘాట్‌ను ఆలయ అధికారులు శనివారం శుభ్రం చేయించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయుటకు అనుగుణంగా కోనేరులో ఉన్న నాచు, చెత్తాచెదారంను తీసి వేయించి పుష్కర ఘాట్ మొత్తాన్ని పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ పుష్కర ఘాట్‌కు ఎస్ఎల్బీసీ నుండి కృష్ణ నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇందుకుగాను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రంగా ఉండుటకుగాను కోనేరుని మొత్తం శుభ్రం చేయించడంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, జె.చంద్రయ్య, సీనియర్ అసిస్టెంట్ కె.ఉపేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సీహెచ్.శ్రీకర్ (os), ఎం.నాగరాజు, జే.రవి, వాచ్మెన్స్, స్వీపర్లు ఎన్.అంతమ్మ, కే.అండాలు, సీహెచ్.అండాలు, జి.రమణ పాల్గొన్నారు.