నార్నూర్ : గంజాయి ( Cannabis ) సాగు చేసిన నిందితుడిని అరెస్టు ( Arrest ) చేసి రిమాండ్ కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్ ( CI Prasad ) తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాలేపూర్ గ్రామానికి చెందిన ఎం.బాలాజీ అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బందితో వ్యవసాయ క్షేత్రంపై దాడులు నిర్వహించామని వెల్లడించారు.
తనిఖీలో పంట పొలంలో 24గంజాయి మొక్కలను లభించాయని, సుమారు ఒక్కో మొక్క ఆరు అడుగుల ఎత్తు పెరిగాయని వివరించారు. వాటి విలువ రెండు లక్షల నలభై వేలు ఉంటుందని అంచనా వేశారు. బాలాజీ పై కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని శనివారం పట్టుకుని రిమాండ్ కు తరలించామన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయిస్తూ పట్టుబడినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీ సాయి, ఏఎస్సై గణపతి, కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, కృష్ణ, స్వరాజ్ కుమార్ ఉన్నారు.