మహబుబాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018 అమలులోకి తీసుకొచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని జీవి త బీ మా సంస్థ (ఎల్ఐసీ)కి ప్రభుత్వమే చెల్లించి, రూ. 5 లక్షల పరిహారాన్ని వారి కుటుంబానికి అందించేలా రూపకల్పన చే సింది.
అయితే నాలుగు నెలలుగా బీమా పరిహారం సకాలంలో అందడం లే దు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే గత ఏడాది ఆగస్టు నుంచి మే వరకు 638 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. వీరిలో ఇప్పటి వరకు 406 మందికి రూ. 20.30 కోట్ల బీమా పరిహారాన్ని చెల్లించారు. ఇందులో గత ఫిబ్రవరి, మార్చి, ఏప్పిల్, మే నెలల్లో చనిపోయిన 232 మంది రైతులకు సంబంధించిన రూ. 11. 60 కోట్ల చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నా యి. 232 మంది 85 మందికి సంబంధించిన ప త్రాల పరిశీలనను ఎల్ఐసీ అధికారులు పూర్తిచేయ గా, మిగతా 147 మందికి చెందిన పత్రాలను వెరి ఫై చేస్తున్నారు.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ప్రీమియాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తే ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు నెలలకొకసారి ఎల్ఐసీకి ముట్టచెపుతున్నది. సర్కారు ప్రీమియం చెల్లిస్తేనే చనిపోయిన రైతులకు సంబంధించిన క్లెయిమ్ డబ్బులను వారి నామినీ ఖాతాల్లో ఎల్ఐసీ జమచేస్తుంది. ఈ దఫా ప్రీమియం చెల్లింపును సర్కారు ఆలస్యం చేయడంతోనే పరిహారం అందించడం లేటవుతున్నట్లు సమాచారం. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలు బీమా సొమ్ము కోసం నెలలుగా ఎదురుచూడక తప్పడం లేదు.
మా ఆయన ముదిరెడ్డి రామచంద్రయ్య ఫిబ్రవరి 28న గుండె పోటుతో చనిపోయిండు. వ్యవసాయ శాఖ అధికారులకు పత్రాలన్నీ అందించినం. నెల రోజుల్లో డబ్బులు పడతాయని అన్నరు. మూడు నెలలవుతున్నా ఇంకా ఖాతాలో జమకాలేదు. పెట్టుబడి కోసం గతంలో తెచ్చిన అప్పులున్నయి. పరిహారం పైసలు వస్తే ఉన్న అప్పులు తీర్చుకుందామనుకుంటున్నం. రోజుల తరబడి ఆశగా ఎదురు చూస్తున్నం.
– ఎం కళమ్మ, ఉప్పలపాడు, బయ్యారం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతు చనిపోయిన 10 నుంచి 15 రోజుల్లో బీమా పరిహారం రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ పథకంలో దళారుల ప్రమేయం, అవినీతికి ఆస్కారం లేకుండా రైతులతో పాటు, నామినీ వివరాలను సేకరించి బీమా సంస్థకు అందించింది. ఎవరైనా రైతు సహజంగానైనా లేదా ప్రమాదంలోనైనా చనిపోయిన వెంటనే వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) క్షేత్రస్థాయిలో రైతు వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం రూ. 5 లక్షల బీమా సొమ్ము నేరుగా రైతు నామినీ ఖాతాలో జమయ్యేది. బాధితులకు ఒక్కపైసా ఖర్చుకాకుండా, చెల్లింపులో జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా స్థాయిలో ఓ నోడల్ ఆఫీసర్ పర్యవేక్షించే వారు.