చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి
టెండర్ విధానాన్ని రద్దు చేసి టెస్కో ద్వారానే చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాల ని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల తరపున ఆమరణ నిరాహా ర దీక్షకు సిద్ధమని వెల్లడించారు. శనివారం వరంగల్ కొత్తవాడలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్ర హం వద్ద చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసనకు ఆయన సంఘీభావం ప్ర కటించారు.
- లేదంటే కార్మికుల తరపున ఆమరణ దీక్షకు సిద్ధం
- జీవో నంబర్ 1ను వెంటనే అమలు చేయాలి
- మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
- చేనేత సంఘాల శాంతియుత నిరసనకు సంఘీభావం
కాశీబుగ్గ, జూన్ 6 : టెండర్ విధానాన్ని రద్దు చేసి టెస్కో ద్వారానే చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాల ని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. లేదంటే కార్మికుల తరపున ఆమరణ నిరాహా ర దీక్షకు సిద్ధమని వెల్లడించారు. శనివారం వరంగల్ కొత్తవాడలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్ర హం వద్ద చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసనకు ఆయన సంఘీభావం ప్ర కటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత రంగానికి మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రాముఖ్యతనిచ్చారని, బీమా, నేతన్నలకు చేయూత, చేనేత లక్ష్మి తదితర పథకాలతో పాటు సహకార సంఘాల బలోపేతానికి 40 శాతం ప్రత్యేక రాయితీ కల్పించారన్నారు. చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నలకు భరోసా ఇచ్చారన్నారు. జీవో నంబర్ 1 ద్వారా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఇతర ప్ర భుత్వ అవసరాల కోసం చేనేత ఉత్పత్తుల కొనుగోలు కు ప్రాధాన్యత కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు టెస్కో ద్వారా పనులు అప్పగించాల్సింది పోయి టెండర్ విధానాన్ని తీసుకురావడంతో కార్మికులు నష్టపోతున్నారన్నారు.
టెండర్ విధానంతో సంఘాల ఉనికి ప్రమాదంలో పడిందని, వేలాది కుటుంబాలకు జీవనోపాధి దక్కని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 1ను అమలు చేసి కార్మికులకు భరోసా కల్పించాలని, లేదంటే నిరసనలను ఉధృతం చేస్తామని నన్నపునేని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దేవులపల్లి సత్యనారాయణమూర్తి, అడెపు రవీందర్, యెలుగం వెంకటమల్లు, అడిగొప్పుల సంపత్, యెలు గం సాంబయ్య, ఓంప్రకాష్, కొలిపాక మదునయ్య, యెలుగం చిన్న భద్రయ్య, కూరపాటి సంపత్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, కటకం విజయ్‌కుమార్, వలుస కిరణ్, బూర వేణు, దువ్వల రాజేందర్, నీలం రాజ్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

