ధీమా ఇవ్వని రైతు బీమా!
రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018 అమలులోకి తీసుకొచ్చింది. 1
- పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు
- మహబూబాబాద్ జిల్లాలో 232 మందికి జమకాని డబ్బులు
- పెండింగ్‌లో రూ. 11.60 కోట్లు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడమే కారణం?
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజుల్లోపే చెల్లింపు
మహబుబాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018 అమలులోకి తీసుకొచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని జీవి త బీ మా సంస్థ (ఎల్ఐసీ)కి ప్రభుత్వమే చెల్లించి, రూ. 5 లక్షల పరిహారాన్ని వారి కుటుంబానికి అందించేలా రూపకల్పన చే సింది.
అయితే నాలుగు నెలలుగా బీమా పరిహారం సకాలంలో అందడం లే దు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే గత ఏడాది ఆగస్టు నుంచి మే వరకు 638 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. వీరిలో ఇప్పటి వరకు 406 మందికి రూ. 20.30 కోట్ల బీమా పరిహారాన్ని చెల్లించారు. ఇందులో గత ఫిబ్రవరి, మార్చి, ఏప్పిల్, మే నెలల్లో చనిపోయిన 232 మంది రైతులకు సంబంధించిన రూ. 11. 60 కోట్ల చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నా యి. 232 మంది 85 మందికి సంబంధించిన ప త్రాల పరిశీలనను ఎల్ఐసీ అధికారులు పూర్తిచేయ గా, మిగతా 147 మందికి చెందిన పత్రాలను వెరి ఫై చేస్తున్నారు.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బీమా ప్రీమియాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తే ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు నెలలకొకసారి ఎల్ఐసీకి ముట్టచెపుతున్నది. సర్కారు ప్రీమియం చెల్లిస్తేనే చనిపోయిన రైతులకు సంబంధించిన క్లెయిమ్ డబ్బులను వారి నామినీ ఖాతాల్లో ఎల్ఐసీ జమచేస్తుంది. ఈ దఫా ప్రీమియం చెల్లింపును సర్కారు ఆలస్యం చేయడంతోనే పరిహారం అందించడం లేటవుతున్నట్లు సమాచారం. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలు బీమా సొమ్ము కోసం నెలలుగా ఎదురుచూడక తప్పడం లేదు.
ఆశగా ఎదురు చూస్తున్నం
మా ఆయన ముదిరెడ్డి రామచంద్రయ్య ఫిబ్రవరి 28న గుండె పోటుతో చనిపోయిండు. వ్యవసాయ శాఖ అధికారులకు పత్రాలన్నీ అందించినం. నెల రోజుల్లో డబ్బులు పడతాయని అన్నరు. మూడు నెలలవుతున్నా ఇంకా ఖాతాలో జమకాలేదు. పెట్టుబడి కోసం గతంలో తెచ్చిన అప్పులున్నయి. పరిహారం పైసలు వస్తే ఉన్న అప్పులు తీర్చుకుందామనుకుంటున్నం. రోజుల తరబడి ఆశగా ఎదురు చూస్తున్నం.
– ఎం కళమ్మ, ఉప్పలపాడు, బయ్యారం
15 రోజుల్లోపే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతు చనిపోయిన 10 నుంచి 15 రోజుల్లో బీమా పరిహారం రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ పథకంలో దళారుల ప్రమేయం, అవినీతికి ఆస్కారం లేకుండా రైతులతో పాటు, నామినీ వివరాలను సేకరించి బీమా సంస్థకు అందించింది. ఎవరైనా రైతు సహజంగానైనా లేదా ప్రమాదంలోనైనా చనిపోయిన వెంటనే వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) క్షేత్రస్థాయిలో రైతు వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం రూ. 5 లక్షల బీమా సొమ్ము నేరుగా రైతు నామినీ ఖాతాలో జమయ్యేది. బాధితులకు ఒక్కపైసా ఖర్చుకాకుండా, చెల్లింపులో జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా స్థాయిలో ఓ నోడల్ ఆఫీసర్ పర్యవేక్షించే వారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

