జూబ్లీహిల్స్‌లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే కే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో రౌడీలు కత్తులు, కటార్లతో వీరంగం చేశారని, బందోబస్తులో ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ, వారికి స్వాగతం పలికారని ధ్వజమెత్తారు.