బంజారాహిల్స్,అక్టోబర్ 17: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థించారు. శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ షఫీతో పాటు ఇతర నాయకులతో కలిసి శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న వారిని కలిసి బీఆర్ఎస్కు ఓటేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థించారు.
పదేండ్ల్లలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, 20నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పినట్లవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్,అక్టోబర్ 17: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన విషయాన్ని వారంతా గుర్తుచేస్తున్నారని, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తామంతా మాగంటి సునీతమ్మకు ఓటేస్తామని చెబుతున్నారని మాజీ మంత్రి, రహ్మత్‌నగర్ డివిజన్లో క్లస్టర్ ఇన్చార్జి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్లోని రెండు బూత్‌లలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించడంతో పాటు స్థానికంగా ఉన్న మజీదు వద్ద శుక్రవారం వారిని కలిశారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హయాంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని స్థానికులు చెబుతున్నారన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లోని మైనార్టీలతో పాటు పేదలందరూ మాగంటి సునీతమ్మకు ఓటేస్తామని చెబుతున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరికి ఓటేయాలనే విషయంలో ప్రజలంతా స్పష్టతతో ఉన్నారన్నారు.