జూబ్లీహిల్స్,అక్టోబర్17: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ కమలాపురి కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 లలో శుక్రవారం బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, నాయకులు ఆజం అలీ, అర్షద్ నవాబ్, అలీ మస్కతీ తదితర ప్రముఖులతో కలిసి ముస్లిం మైనార్టీలతో సమావేశమయ్యారు.
అనంతరం ముస్లిం ప్రముఖులను, యువతను కలిసి ఉర్దూలో ప్రచురించిన కరపత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒమర్ ఖాన్, అశీష్ కుమార్ యాదవ్, పుస్తె శ్రీకాంత్, పవన్ రెడ్డి, వాసాల వెంకటేష్, జెన్నాయికోడే జగన్మోహన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగంటి అమర్ హై.. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. సునీత గోపినాథ్‌ను గెలిపిద్దాం..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.