షేక్‌పేట్ అక్టోబర్ 17: బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యేగా మాగంటి సునీతాగోపినాథ్ గెలుపు ఖాయం అని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
శుక్రవారం పార్టీ నాయకులు చెరక మహేష్‌తో కలిసి కార్తీక్ రెడ్డి ఓయూ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రావులకోళ్ల నాగరాజు పాల్గొన్నారు.