కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. తర్వాత వరుస విజయాలతో సెమీస్‌కు మరింత చేరువవుతున్నది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) సాధించింది.
వర్షం తీవ్ర అంతరాయం కల్గించిన మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించగా లంక నిర్దేశించిన 121 ఛేదనను ఆ జట్టు 14.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా దంచేసింది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ (60*), తజ్మిన్ బ్రిట్స్ (55*) రాణించారు. ఈ టోర్నీలో సఫారీలకు ఇది నాలుగో విజయం. కాగా మొదట బ్యాటింగ్ చేసిన లంక.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 105 రన్స్ చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నె (34) టాప్ స్కోరర్.