టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను సౌతాఫ్రికా దిగ్గజం, మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్‌తో చాలా మంది పోలుస్తుంటారు. పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఇదే పోలిక తీసుకురావడం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారధి, లెజెండరీ ఆటగాడు రికీ పాంటింగ్ కూడా సూర్యను డివిల్లీర్స్‌తో పోల్చాడు. అయితే ఈ పోలికను పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ తప్పుబట్టాడు.
సూర్యను, డివిల్లీర్స్‌తో పోల్చడం కొంచెం అతిగా ఉందని బట్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీల్లో సూర్య ఇంకా రాణించలేదని, వాటిలో అతని ఆటతీరు చూడాల్సి ఉందని చెప్పాడు. డివిల్లీర్స్ ఆడినట్లు ఎవరూ క్రికెట్ ఆడలేదని, అలాంటి వ్యక్తితో అప్పుడే సూర్యకుమార్‌ను పోల్చడం అతిగా ఉందని అన్నాడు. సూర్యకుమార్ కూడా డివిల్లీర్స్‌తో పోలికను అంగీకరించలేడని, సూర్య ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. ప్రపంచ క్రికెట్లో డివిల్లీర్స్ వచ్చే వరకు అలా ఎవరూ క్రికెట్ ఆడలేదని, కావాలంటే సూర్యను వివ్ రిచర్డ్స్‌తో పోల్చుకోవచ్చని అన్నాడు.
డివిల్లీర్స్ వేరే స్థాయి ఆటగాడని, అతన్ని అవుట్ చెయ్యకపోతే మ్యాచ్ చేజారిపోతుందని ప్రత్యర్థులకు తెలుసునని బట్ చెప్పాడు. ఇటీవలి కాలంలో విలియమ్సన్, రూట్, కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు కూడా అద్భుతమై ఆటతీరు కనబరిచారని, వాళ్లందర్నీ వదిలేసి సూర్యను డివిల్లీర్స్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నించాడు. విమాన ప్రయాణంతో వచ్చిన జెట్ ల్యాగ్ వల్ల పాంటింగ్ ఈ కామెంట్స్ చేశాడేమో అంటూ జోకులు పేల్చాడు.