నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 08 : గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీఓ సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఏదో నాలుగు పాఠాలు చెప్పామా, వెళ్లామా అని కాకుండా కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నారన్నారు. విద్యార్థులకు మూస ధోరణిలో కాకుండా వినూత్నమైన పద్ధతిలో బోధించడం వల్ల సులువుగా అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కాంతయ్య, జలంధర్ రెడ్డి, రూప, శైలజ, ప్రసన్న, సుమలత, సంజీవ్, సురేశ్ పాల్గొన్నారు.