పెన్పహాడ్, సెప్టెంబర్ 08 : వానాకాలం సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం అగచాట్లు తప్పడం లేదు. గంటల తరబడి లైన్లలో వేచిఉన్నా యురియా దొరుకుతుందన్న నమ్మకమూ లేదు. సోమవారం యూరియా బస్తాలు ఇస్తున్నారు అని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పెన్పహాడ్ మండల కేంద్రంలోని చిదేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు పడిగాపులు కాశారు. వ్యవసాయ అధికారులు సొసైటీ వద్ద టోకెన్లు ఇస్తే తమకు ఇంత ఇబ్బంది ఉండేది కాదని, రైతులకు అవసరమయ్యే యూరియా కూడా ఇవ్వడం లేదని, ఒకరికి ఒక బస్తా యూరియాను అందించడంతో ఎలా వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు మోతాదుకు మించి యూరియా వాడుతున్నారు. ఈ పద్ధతిని నియంత్రించడానికి యూరియా బస్తాల పంపిణీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రైతులు సంప్రదాయబద్ధంగా యూరియా వాడకం తగ్గించి, నానో యూరియా ఎకరాకు 500 మి.లీ. వాడితే మంచి ఫలితాలు ఇవ్వడమే కాకుండా రైతులకు పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది.
Penpahad : సొసైటీ వద్దే యూరియా టోకెన్లు ఇవ్వాలి