చందంపేట, సెప్టెంబర్ 08 : చందంపేట మండలంలోని వివిధ గ్రామాల ఓటర్ జాబితాను అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించి తుది జాబితాను సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు ఎంపీటీసీల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాదిక్, లోక్య నాయక్, గిరి, రాజు, శ్రీనివాస్, వెంగళయ్య పాల్గొన్నారు.