ఇల్లెందు, మే 13 : ఇల్లెందు వ్యవసాయ శాఖలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఇల్లెందు మండలంలో రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరుకు ఉత్పత్తి, నిల్వ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నిబ్యాగ్స్, ట్రాన్స్పోర్ట్, హమాలీ సమస్యలపై రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ సంబంధిత నిలయాలు, గిరిజన భవన్ వంటివి చూసి సరుకును తరలించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డ్ గిడ్డంగులలో మొక్కల నిలువను, అకాల వర్షాలతో తడిచిన మొక్కలను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాంబాబు, సొసైటీ చైర్మన్ మెట్ల కృష్ణ, రెపల్లెవాడ సర్పంచ్ బానోత్ శారద, స్ధానిక ఎంపీడీఓ దన్సింగ్, తాసీల్దార్ సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏడీఏ లాల్ఛంద్, ఏఓ సతీష్ పాల్గోన్నారు.