కోయంబత్తూరు : కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బృందావన్ నగర్-ఎస్ఐహెచ్ఎస్ కాలనీ రోడ్ సమీపంలో, ఓ స్థలంలో, కారులో ఉన్నారు.
ముగ్గురు దుండగులు ఆ కారు అద్దాన్ని రాయితో పగులగొట్టి, కారు డోర్‌ను తెరిచారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని కొట్టి, ఆమెను లాక్కెళ్లారు. పోలీసులు గాలింపు జరపగా, కొద్ది గంటల తర్వాత ఆమె ఓ నిర్జన ప్రదేశంలో కనిపించింది. ఆమెను ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.