చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రతిపాదనను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పార్టీ ఎంపీ, న్యాయవాది ఎన్ఆర్ ఇలాంగో ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు పార్టీ నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి వెల్లడించారు. తమిళనాడు సహా 12 రాష్ర్టాలు, యూటీల్లో ‘సర్’ను నిర్వహించాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఇప్పటికే తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసింది.