(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : జీపీఎస్, ఇంటర్-డ్రోన్ కమ్యూనికేషన్, సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ సాయం లేకుండానే స్వతంత్రంగా ఎగిరే డ్రోన్ల సాంకేతికతను ఐఐటీ-బాంబే పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ప్రత్యేకంగా అమర్చిన కెమెరాల సాయంతో పరిసరాలను అంచనా వేసుకొంటూ ఈ డ్రోన్లు ఎప్పటికప్పుడు దిశలను మార్చుకొంటాయని పరిశోధకులు తెలిపారు. జీపీఎస్ పరిధి లేనటువంటి ప్రాంతాలు, క్లిష్టమైన మిలిటరీ అవసరాలకు ఈ తరహా డ్రోన్లు ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. నిఘా, పర్యవేక్షణకు ఈ డ్రోన్ల సహాకారం ఎంతో ఉంటుందన్నారు.