ధర్మసాగర్/ వేలేరు, నవంబర్ 3 : మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే కోరారు. పత్తి ఎకరాకు రూ.లక్ష, వరికి రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్, ముప్పారం, నారాయణగిరి, వేలే రు మండలకేంద్రంతో పాటు పీచర, లోక్యాతండాల్లో పర్యటించి మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతు ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, రైతుల ఉసు రు తీయడానికే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
రైతుల పక్షపాతిగా ఉండాల్సిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్‌రెడ్డి తొత్తుగా మారాడన్నారు. సన్న వడ్లకు బోనస్ కాస్త బోగస్‌గా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కడియంకు చిత్తశుద్ధి లేదని, వరదలకు కొట్టుకుపోయిన రోడ్లకు కనీసం మరమ్మతు చేయడంలేదని విమర్శించారు. దేవునూర్‌లో ఉన్న కడియం శ్రీహరి భూమిని కౌలుకు తీసుకున్న రైతుల నుంచి మానవతా దృక్పథం తో కౌలు పైసలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేవునూర్, సోమదేవరపల్లి గ్రామాల్లో సూమారు 500 మం ది రైతులకు చెందిన వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దేవునూర్ శివారులో కొట్టుకపోయిన వా గు, ప్రధాన రహదారులకు వెంటనే మరమ్మతులు చే యాలన్నారు.
అలాగే వరద ఉధృతిని అంచనా వేయకుండా, ధర్మసాగర్ రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను ఎత్తిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చేతికందిన పంట నీట మునగడంతో ఎమ్మెల్యే కడియం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మోరె మహేందర్‌ను రాజయ్య పరామర్శించి ఆరో గ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన పశువులకు ప్రకృతి విపత్తు కింద కలెక్టర్ పరిహారం అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మం డల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని రాజయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో ధర్మసాగర్, వేలేరు మండల ఇన్చార్జిలు కర్ర సోమిరెడ్డి, ఇట్టబోయిన భూపతిరాజ్, వేలే రు మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, నాయకులు లక్క శ్రీనివాస్, లాల్‌మహ్మద్, ప్రేమ్‌కుమార్, పుట్ట వెంకట్రాజం, స్వామి, కొయ్యడ మహేందర్ పాల్గొన్నారు.