ట్రక్ డ్రైవర్ బీభత్సం.. 19 మంది దుర్మరణం
మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలను ఢీకొంటూ, పాదచారులను తొక్కుకుంటూ దూసుకుపోయింది.
జైపూర్, నవంబర్ 3 : మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలను ఢీకొంటూ, పాదచారులను తొక్కుకుంటూ దూసుకుపోయింది.
తీవ్ర మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ తన ట్రక్ ఇతర వాహనాలను ఢీకొంటున్నా, ట్రక్కు కింద నలిగి అమాయకుల ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా, ఆపకుండా ఐదు కిలోమీటర్ల పాటు అలాగే వేగంగా నడుపుకుంటూ బీభత్సం సృష్టించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు ఒక వాహనాన్ని ఢీకొని ట్రక్కు ఆగిపోయిన తర్వాతే ఈ విధ్వంసం ఆగింది. ఈ విధ్వంసంలో పలువురు వాహనాల్లోనే మరణించగా, చాలామంది తీవ్ర గాయాలతో వాటిలోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు లాగి సమీపంలోని దవాఖానలకు తరలించారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి ఉన్నట్టు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

