నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సీఎం కేసీఆర్ కప్ కబడ్డీ టోర్నీ మంగళవారం పాత కలెక్టరేట్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే టోర్నీని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పుతున్నాం.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ప్లేయర్లను ప్రోత్సహిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మేమర్ నీతూకిరణ్, రాంకిషన్‌రావు పాల్గొన్నారు.