హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.