మక్తల్, అక్టోబర్ 3 : రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారం మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన కొనసాగిస్తున్నదని, ప్రజలను త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు రానున్నాయని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పరిపాలనలో అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాష్ట్రం అప్పుల పాలైందంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు తప్పా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. కనీసం రైతన్నలకు సకాలంలో ప్రభుత్వం యూరియా అం దించక పోవడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొవడంతో పాటు పంటను బతికించుకునేందుకు, ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రం లో కనిపిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ వస్తే కష్టాలే వస్తాయని కేసీఆర్ ముందే చెప్పారని, అయినా ప్రజలు ఏదో మార్పు వస్తుందని ఓట్లేసి గెలిపించి ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారన్నారు. ప్రజలు అందుకే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని, అదే విధంగా పార్టీ శ్రేణులు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సం క్షేమ పథకాలను వివరించి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.