మాగనూర్ : నారాయణపేట ( Narayanpet ) జిల్లా మాగనూర్,కృష్ణ మండలంలో ఇద్దరు గర్భిణీలు అంబులెన్స్ ( Ambulance) లో ప్రసవమయ్యారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ శేఖర్, పైలట్ జంబేష్ మల్లికార్జున్ వెల్లడించారు. కృష్ణ మండలం కూసుమూర్తి గ్రామానికి చెందిన భీమ్ బాయ్ నొప్పులు రావడంతో ఆశ వర్కర్ శోభా సమాచారం అందజేసి 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి.
దీంతో సిబ్బంది అంబులెన్స్‌లో కుటుంబ సభ్యుల మధ్య ప్రసవం చేశారు. కొద్ది గంటల్లోనే మాగనూరు మండలం కోల్పూర్ గ్రామానికి చెందిన గర్భిణి అశ్వినిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు కూడా మగబిడ్డలకు జన్మనిచ్చారు. అనతరం తల్లి బిడ్డలను మాగనూర్ పీహెచ్సీలో చేర్పించారు. అక్కడి వైద్యులు తల్లి బిడ్డను పరిశీలించి తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. సమయస్ఫూర్తితో గర్భిణీలకు సుఖప్రసవం చేసిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి వైద్యులు అభినందించారు.