ఖిల్లాఘణపురం, అక్టోబర్ 3 : అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన స్వార్థం కోసం వరి పొలానికి సాగునీరు ఇబ్బంది అవుతుందని తూ మును ధ్వంసం చేయడంతో సాగునీటితో పాటు నీటిలో ఉన్న రూ.లక్షల విలువ చేసే చేపలు వాగుపాలైన ఘటన మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామ పరిధిలోని చిన్నయ్యకుంట చెరువు ఒకటి మత్స్యకారులు, రైతులకు ఆధారమని ఈ చెరువు కింద అధికారికంగా 30 ఎకరాలు, అనాధికారికంగా 40 ఎకరాలకుపైగా సాగవుతుంది. చెరువులోపల ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 మందికి పైగా రైతుల పొలాలు కూడా సాగవుతున్నాయి.
కొంతమంది ఆయకట్టు రైతులకు చెరువు లోపల ఉన్న రైతులకు రెండేళ్లుగా వివాదాలు ఉం డడంతో రెవెన్యూ అదికారులతోపాటు నీటిపారుదల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసి నీటిని బయటకు పోకుండా కట్టుబడి చేశారు. చెరు వు బయట ఉన్న రైతు ల పొలాలు 15 రోజు ల్లో కోయడానికి వ స్తుండడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు తూమును ధ్వంసం చేసి చెరువులో ఉన్న నీటిని మొత్తాన్ని బయటకు వదిలారు. దీంతో చెరువులో వదిలిన చేపలన్నీ పంట కాల్వల వెంబ డి వాగులో కలిసిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు లక్షల్లో నష్ట వాటిల్లిందని ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఏఈ తో పాటు రెవెన్యూ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా రెండు రోజులుగా వరుసగా సె లవులు రావడంతో స్పందించలేదని వాపోయా రు. సంబంధిత అధికారులు కల్పించుకొని గ్రామానికి చెందిన మత్స్యకారులకు నష్టపరిహారం అందించడంతోపాటు తూమును ధ్వంసం చేసిన నీటిని బయటకు వదిలిన వారిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులతోపాటు మత్స్యకారులు కోరుతున్నారు.