డ్రాగన్ కంట్రీ చైనా ఎంతగా వారిస్తున్నా వినకుండా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ నాన్సీ పెలోసీ.. తైవాన్ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండిపడింది. ఈ క్రమంలోనే పెలోసీపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.
‘‘చైనా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా కూడా పెలోసీ మాత్రం తైవాన్ సందర్శనకు వచ్చారు. ఇది కేవలం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా.. దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే అంశం. ఒకటే చైనా విధానాన్ని అవమానించడం కూడా. అలాగే తైవాన్ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఈ పర్యటన ఉంది’’ అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్సీ పెలోసీతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.