అమరావతి : తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని , ఈ కేసులో సీఎం చంద్రబాబును (Chandra Babu) మొదటి ముద్దాయిగా (First accused ) కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ( Roja) డిమాండ్ చేశారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదని ఆరోపించారు. టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిందితులపై చర్యలు తీసుకోకపోగా అధికారులను కాపాడాలనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంతో హిందూవుల మనోభావాలు సీఎం, డిప్యూటీ సీఎంకు ఇంకా తెలియరావడం లేదని అన్నారు. సంధ్యా థియేటర్ (Sandhya Theatre) ఘటనలో ఒకరు చనిపోతే అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారని, గేమ్ ఛేంజర్ ( Game Changer ) ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తిరుమలలో ఇలాంటి ఘోరమైన దుర్ఘటనలు ఎప్పుడు జరుగలేదని అన్నారు
.చంద్రబాబు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో టీటీడీ పరువు, ప్రతిష్ట దిగజారే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తనకు సంబంధించిన మనుషులను టీటీడీలో పెటుకున్నారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన సుబ్బారాయుడిని తిరుపతి ఎస్పీగా పెట్టుకున్నారని విమర్శించారు. అంతకు ముందు ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
Aslo Read :
Margani Bharat | టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలి : మాజీ ఎంపీ భరత్ డిమాండ్