అమరావతి : ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిపై (Minister Anam Ramnarayana Reddy) టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఫైర్ అయ్యారు. తిరుపతి ( Tirupati ) ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని డబ్బులు పంచారని, ఆసుపత్రిలో పరికరాలను ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయని మంత్రి ఆరోపించారు.
ఈ ఆరోపణలను భూమన ఖండించారు. దేవుడి మీద భక్తి ఉంటే సీసీ కెమెరాల్లో (CC Footage ) నమోదైన దృశ్యాలను విడుదల చేయాలని, లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి టీటీడీ తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలను ప్రారంభించింది.ఈ సందర్భంగా పద్మావతి పార్కులో నెలకొల్పిన కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6గురు చనిపోగా మరో 48 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కూ పరామర్శించిన సమయంలో క్షతగాత్రులు వ్యతిరేకంగా మాట్లాడాలని కవర్లలో డబ్బులు పంచారని మంత్రి ఆనం ఆరోపించారు.