Margani Bharat | టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలి : మాజీ ఎంపీ భరత్ డిమాండ్
Margani Bharat | వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ పాలకమండలి బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampade) ఘటనకు టీటీడీ (TTD) పాలకమండలి బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Bharat ) డిమాండ్ చేశారు.
శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయ్యారని , భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. టీటీడీ చైర్మన్, ఈవోల మధ్య సమన్వయ లోపం ఉందని స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.
చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయ్యారని పేర్కొన్నారు. వైఎస్ జగ్ హయాంలో ఏనాడు, ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరుగలేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయా అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. తిరుపతి ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ మొత్తం ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

