అమరావతి : తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ అమ్మినట్టు ఆరోపణలు రావడంతో వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC ) భరత్ (Bharat ) పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు (Guntur district ) చెందిన ఎమ్మెల్సీ భరత్ పై టీడీపీ నేత చిట్టిబాబు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరుకు చెందిన కొందరి నుంచి సుమారు రూ.3 లక్షలు ఆన్లైన్ ద్వారా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గుంటూరు అరండల్పేట స్టేషన్లో ఎమ్మెల్సీతో పాటు పీఆర్వో మల్లికార్జునపైనా కూడా కేసు నమోదు (Case registered) చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రాబాబుపై పోటీ చేసి ఓడిపోయాడు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల