అర్వపల్లి, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, మొరిశెట్టి ఉపేందర్ గురువారం అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలి ఎమ్మెల్యేలను కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై ఉసిగొల్పుతున్నాడన్నారు. కేసీఆర్పై ఈగ వాలిన రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కర్నాటి వెంకన్న, బానోతు సైదులు, నున్న యాదగిరి, నాయకులు తాడూరు రామకోటి, కడారి నరేశ్, కట్టెల మల్లేశ్, దుబ్బాక యల్లంరాజు, గడ్డం వెంకన్న, ఓర్సు వెంకన్న, భైరబోయిన పెద్దయ్య, ఎండీ హమీద్, వట్టే వెంకన్న, సుంకరి వెంకన్న, మనుబోతుల నరేశ్, బింగి సాయి పాల్గొన్నారు.