భోపాల్: ఒక రెవెన్యూ అధికారి సర్వే కోసం ఒక గ్రామానికి వెళ్లారు. తన బూట్లు నీటిలో తడవకుండా ఉండేందుకు ఒక వృద్ధుడి వీపుపైకి ఎక్కి కాలువ దాటారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిని సస్పెండ్ చేశారు. (Revenue Official On Elderly Man’s Back) మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పట్వారీ నీలేష్ నామ్దేవ్ అధికారిక సర్వే కోసం మాతా గ్రామానికి వెళ్లారు. అయితే ఆయన ఒక చిన్న కాలువను దాటాల్సి వచ్చింది. నీటిలో తన బూట్లు తడవకుండా ఉండేందుకు లల్వా కేవత్ అనే వృద్ధుడి వీపుపైకి ఎక్కి ఆ కాలువను దాటారు.
కాగా, కొన్ని నెలల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ అధికారుల ప్రవర్తన, వృద్ధుల పట్ల వ్యవహరించే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. సిధి ఎస్డిఎం ప్రియా పాఠక్ చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారి నీలేష్ నామ్దేవ్ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపే బాధ్యతను అదనపు కలెక్టర్కు అప్పగించారు.
🚨Patwari Sahab in Sidhi, Madhya Pradesh climbed onto an elderly man’s back just to keep his shoes from getting wet.
And they suspended him for such a tiny thing. Unbelievable. pic.twitter.com/5DBLOR4lvW
— Gems (@gemsofbabus_) September 9, 2026