చెన్నై: ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ(Duleep Trophy) గెలుచుకున్నది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టుకు ట్రోఫీ దక్కింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ద్వారా ఈస్ట్ జోన్‌ను విజయం వరించింది. ఇవాళ అయిదో రోజు తన రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ ఏడు వికెట్ల నష్టానికి 388 రన్స్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టు 760 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే ఇద్దరు కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో దులీప్ ట్రోఫీ ఈస్ట్‌జోన్ సొంతం చేసుకున్నది. రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ బ్యాటర్ మొహమ్మద్ కౌనియన్ ఖురేషి సెంచరీ చేశాడు. 116 రన్స్‌తో అతను నాటౌట్‌గా నిలిచాడు.
అయిదో రోజు 5 వికెట్లకు 212 రన్స్ వద్ద ఆట ప్రారంభించిన ఈస్ట్ జోన్.. చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ కొనసాగించింది. సౌత్ జోన్ బౌలర్లు పెద్దగా వత్తిడి పెంచలేకపోయారు. సిరాజ్‌కు సపోర్టు లేకపోవడంతో ఈస్ట్ జోన్ ఈజీగా పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఈస్ట్ జోన్. తొలి ఇన్నింగ్స్‌లో 708 రన్స్ చేసిన ఆ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లోనూ ధాటిగా ఆడింది. ఇక సౌత్ జోన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 336 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.
Handshakes in the middle to conclude a fantastic Final 🤝
East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD
— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 270, రెండో ఇన్నింగ్స్‌లో 80 రన్స్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతను 350 రన్స్ చేసి దులీప్ ట్రఫీ ఫైనల్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. అతని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 99 రన్స్ చేసిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ఈస్ట్ జోన్ గెలవడం ఇది మూడోసారి.
𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆
Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp
— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026