Siricilla Municipalilty | సిరిసిల్ల, ఫిబ్రవరి 11 : సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సిరిసిల్లలోని 39 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటర్లు జై కొడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సిరిసిల్లలో కేటీఆర్ ఇటీవల విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఓటర్లు అంతా కేసీఆర్, కేటీఆర్ కు జై కొడుతున్నారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధం కావడం కనిపిస్తున్నది. కాగా
ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలతో గొడవకు దిగుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు గొడవలకు దిగుతుండటం గమనార్హం. పలువార్డుల్లో ఇప్పటికే అధికారపార్టీ అభ్యర్థులు ‘చేయి’ లు ఎత్తేశారు.
గులాబీ జోరు చూసి చేసేదేమిలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పి దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఓటర్లు చీదరించుకోవడం గమనార్హం. సిరిసిల్ల మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.

కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు