మునుగోడు, ఫిబ్రవరి 11 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వి. బి జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించుకోవాలని ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పిలుపునిచ్చారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల కార్మికులతో కలిసి దేశవ్యాప్త సమ్మె పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి చట్టాలు కార్మికులకు మరణ శాసనం అయిన నాలుగు లేబర్ కోడ్లను, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పందుల చిన్న నరసింహ, కార్యదర్శి ఇదా రాములు, బొల్లు సైదులు, మాలాద్రి, బజారు హమాలి కార్మిక సంఘ నాయకులు చిరంజీవి, వెంకన్న, గిరి పాల్గొన్నారు.