భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా
భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా | భారత విమానాలపై విధించిన బ్యాన్‌ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఒట్టావా : భారత విమానాలపై విధించిన బ్యాన్‌ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో మరోసారి బ్యాన్‌ను పొడగించినట్లు కెనడా రవాణాశాఖ మంత్రి అల్ఘాబ్రా పేర్కొన్నారు.
నిషేధం విధించిన నాటి నుంచి కెనడాకు వచ్చిన విమాన ప్రయాణికుల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని అల్ఘాబ్రా చెప్పారు. తాజా బ్యాన్తోనూ కార్గో విమానాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణాలపై ఏమాత్రం తొందరపడడం లేదన్నారు. టీకాల పంపిణీ కొనసాగుతున్నందున గతవారం నుంచి దేశంలో రోజువారీ కొత్త కేసులు 25శాతం పడిపోయాయని డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజువారీ కేసులు 5వేల వరకు నమోదవుతున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
ఆ కంటెంట్‌ను తొలగించాలి.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశం
విలక్షణ నటుడు చంద్రమోహన్ జన్మదినోత్సవాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

