California Governor | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై యూఎస్ భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ మోదీ చైనా పర్యటన ఆసక్తిని రేకెత్తించింది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రపంచ నేతలను ప్రత్యేకంగా ఆకర్షించింది. ముగ్గురు దేశాధినేతలూ కలిసి ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇది ట్రంప్‌కు గట్టి కౌంటర్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇదే సమయంలో ఈ వీడియోని కాలిఫోర్నియా గవర్నర్ (California Governor) గవిన్ న్యూసమ్ (Gavin Newsom) ఎక్స్‌లో పోస్టు చేశారు. పుతిన్ (Vladimir Putin), మోదీ ఇద్దరూ చేతులు పట్టుకుని సదస్సులో నడుస్తూ జిన్‌పింగ్ (Xi Jinping) వద్దకు వెళ్తున్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ముగ్గురు నాయకులు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన గవిన్.. ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘దీనికి భయపడకండి.. ట్రంప్ తన గార్డ్లను చికాగోకు పంపుతున్నారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
దేశంలో శాంతిభద్రతల విషయంలో ట్రంప్ (Donald trump) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేరాలు, అక్రమ వలసలను అరికట్టేందుకు చికాగో, న్యూయార్క్‌లలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ను విమర్శిస్తూ.. గవిన్ ఈ పోస్ట్ పెట్టినట్లు అమెరికా మీడియా పేర్కొంటోంది.
But have no fear, Trump is sending the Guard to Chicago. pic.twitter.com/yTK5Uhxkde
— Gavin Newsom (@GavinNewsom) September 1, 2025
Also Read..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించండి.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ పిలుపు
జీరో టారిఫ్‌కు భారత్ అంగీకారం.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది: ట్రంప్